ముగ్గురు అమ్మాయిలు స్వర్గానికి వెళ్లారు - అక్కడ ఏం జరిగింది? - ఫన్నీ స్టొరీఒకానొక రోజు ఒక కార్ యాక్సిడెంట్ లో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు. చనిపోయాక వాళ్ళు సరాసరి స్వర్గద్వారం దగ్గరికి వచ్చి ఆగారు. అక్కడ స్వర్గ పాలకుడు, "  అమ్మాయిలూ మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను " అని అన్నాడు. అది విన్న అమ్మాయిలు ఎంతో సంతోషపడ్డారు . కానీ ఒక షరతు, అక్కడ ఉన్న బాతులని మాత్రం తొక్క కూడదు అని చెప్పాడు.


ఓస్ ఇంతేనా అని సంబరపడిపోతూ ఆ అమ్మాయిలు స్వర్గంలోకి అడుగు పెట్టారు. అతడు చెప్పినట్టే స్వర్గం నిండా బాతులే ఉన్నాయి. ఎక్కడ చూసినా బాతులే, కాలు తీసి కాలు వేయాలన్నా కష్టమే అన్నట్టు మొత్తం బాతులతో స్వర్గం నిండిపోయింది. అమ్మాయిలు కాస్త కంగారు పడి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నారు.

ఇంతలో ఒక అమ్మాయి ఒక బాతుని తొక్కేసింది. అలా తొక్కిందో లేదో ద్వార పాలకుడు ప్రత్యక్షం అయ్యాడు. అతనితో పాటు ఒక మహా చెండాలంగా ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. బాతుని తొక్కిన అమ్మాయితో అతను ఇలా అన్నాడు " చూడమ్మా బాతుని తొక్కినందుకు నీకు శిక్ష తప్పదు, నువ్విక ఉన్నంత కాలం ఇతనితో పాటు బంధీగా ఉండాల్సిందే " అన్నాడు. అన్నాక అతనితో వచ్చిన అబ్బాయికి , బాతుని తొక్కిన అమ్మాయికి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళిపోయాడు.

అది చూసిన మిగిలిన ఇద్దరూ ఇంకా జాగ్రత్తగా ఉండసాగారు. కానీ ఇంకో అమ్మాయి కూడా పొరపాటున బాతుని తొక్కేసింది. వెంటనే ద్వార పాలకుడు ఇంకో మహా దరిద్రంగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఇద్దరికీ సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోయాడు.

ఇక మూడో అమ్మాయి ఎంతో జాగ్రత్తగా ఒక్క బాతుని కూడా తొక్కకుండా కొన్ని నెలల పాటు గడిపింది. కొన్ని రోజులయ్యాక ద్వారపాలకుడు మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు. ఈసారి అతనితో పాటు ఒక అందమైన అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి అందం చూసి ఆ అమ్మాయి లోలోపల ఎంతో సంతోషపడింది. ఆ అమ్మాయి సంతోషానికి తగ్గట్టే ద్వార పాలకుడు ఆ ఇద్దరికీ సంకెళ్ళు వేసి ఇక నుంచి మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఇలా అంది " నేను ఏం చేసానో నాకు తెలియదు కానీ నన్ను మీతో బంధించారు". దానికి ఆ అబ్బాయి ఇలా అన్నాడు " నువ్వేం చేసావో నాకు తెలీదుకాని నా ఖర్మకి నేను ఒక బాతుని తొక్కి సచ్చాను." అన్నాడు.


Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి