ట్యూబ్ లెస్ టైర్ లో పంక్చర్ అవగానే గాలి ఎందుకు పోదో మీకు తెలుసా ..??

మనలో చాలా మందికి బైక్స్ ఉండే ఉంటాయి. బైక్ అన్నాక పంక్చర్ అవడం చాలా సాధారణ విషయం. ఇదివరకటి బైక్స్ లో టైర్లకు ట్యూబ్లు ఉండేవి. కానీ కొత్త తరం బైక్ లలో ట్యూబ్ లు లేని టైర్లు వస్తున్నాయి. ఈ ట్యూబ్ లెస్ టైర్లు కూడా పంక్చర్ అవుతాయి కానీ ,  గాలి వెంటనే పోదు. ఎందుకో తెలుసా మీకు? తెలియక పొతే ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యూబ్ లెస్ టైర్ లో గాలి ఎందుకు పోదో తెలుసుకునే ముందు అసలు ట్యూబ్ తో ఉన్న టైర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


ట్యూబుతో ఉన్న టైరు.


మామూలు టైర్లలో, టైరుతో పాటూ ట్యూబ్ కూడా ఉంటుంది. గాలి అంతా ట్యూబులో ఉంటుంది కాబట్టి అది బయటకి పోడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి టైరుకి , రిమ్ముకి కాస్త మధ్య కాస్త ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ మనం పసిగట్టలేనంత తక్కువగా ఉంటుంది. టైరులో మేకు లాంటివి ఏమన్నా గుచ్చుకున్నప్పుడు ట్యూబులోని గాలి వెంటనే బయటకి వచ్చేస్తుంది. టైరుకి రిమ్ముకి మధ్య ఉన్న కాస్త ఖాళీ నుంచి వెంటనే మొత్తం బయటకి వచ్చేస్తుంది.

ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందంటే టైరు ఒక్కసారిగా గాలి లేకుండా అయిపోతుంది. ఒక వేళ వాహనం వేగంలో గాని ఉంటే వెంటనే కింద పడిపోతారు.

అంతే కాకుండా ఈ రకం టైర్లు కాస్త పలుచగా ఉండడం వల్ల ఏమన్నా గుచ్చుకోగానే వెంటనే పగిలిపోతాయి.

ఇక ట్యూబ్ లెస్ టైర్ల విషయానికి వస్తే, ఈ రకం టైర్లలో అసలు ట్యూబ్ ఉండదు అన్న విషయం మనకి వెంటనే అర్ధం అవుతుంది. ఈ టైర్లు చాలా మందంగా మరియు ధృడంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ టైర్లు రిమ్ముకి బలంగా అతుక్కున్నట్టు ఉంటాయి. రిమ్ము నుంచి టైరుని వేరు చేయలేమన్నమాట. అలా ఉండడం వాల్ల గాలి బయటికి పోకుండా ఉంచుతుంది.

ఈ టైర్లలో మేకు లాంటి వస్తువు ఏదైనా గుచ్చుకున్నప్పటికీ చాలా మందంగా, ధృడంగా, ఉండడం వల్ల టైరు వెంటనే పగిలిపోదు. అలాగే టైరు మేకు చుట్టూ గట్టిగా బిగుసుకుపోతుంది. కాబట్టి గాలి పోతుంది కానీ చాలా మెల్లగా పోతుంది. ఇలా మెల్లగా పోవడం వల్ల వెంటనే ప్రమాదాలు జరగవు.  


ట్యూబ్ లెస్ టైర్లలో పంక్చర్ వేయడం కూడా చాలా సులభం. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నందు వాల్ల ఈ కాలంలో వచ్చే అన్ని వాహనాలకు ఈ టైర్లనే వాడుతున్నారు.

ట్యూబ్ లెస్ టైర్లలో పంక్చర్ అవగానే గాలి ఎందుకు పోదో తెలుసుకున్నారుగా, మీ స్నేహితులకి కూడా తెలిసేలా ఈ పోస్టుని షేర్ చేయండి.

మీ ఆలోచనలు మాతో పంచుకోడానికి కింద కామెంట్ చేయగలరు.


Yetakaram Yenkatrao ని  Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి