6 పిల్లల తల్లి, 4 పిల్లల తండ్రి [ Funny Story]అనగనగా ఒకతనికి 6 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఆరుగురు పిల్లల్ని కన్నానని చాలా గర్వంగా ఉండేవాడు. పెద్ద విజయం సాధించానని గర్వంతో కాస్త అతి చేస్తూ ఉండేవాడు. ఎంత ఓవర్ యాక్షన్ అంటే తన భార్యని ఆమె పేరుతో కాకుండా "6 పిల్లల తల్లి", "6 పిల్లల తల్లి " అని పిలుస్తూ ఉండేవాడు.

ఇలా ఉండగా ఒకసారి అతను భార్యతో కలిసి ఒక పార్టీ కి వెళ్లాడు. పార్టీలో లేట్ అవుతుంది ఇక ఇంటికి వెళ్దాం అనుకుని తన భార్య కోసం అటు ఇటు చూసాడు. తనని కూడా అడిగి ఇక ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు.

తను కంటికి కనపడకపోయేసరికి "ఆరుగురు పిల్లల తల్లీ ఇక ఇంటికి వెళ్దామా" అని పార్టీలో అందరికి వినిపించేలా గట్టిగా అరిచాడు.

తన భర్త ఆలోచన లేకుండా అలా అరిచేసరికి ఆమెకి చిర్రెత్తుకొచ్చింది. అతనికి బుద్ది చెప్పాలని తను కూడా గట్టిగా "మీ ఇష్టం నలుగురు పిల్లల తండ్రి " అని అరిచింది.