శుభ వార్త..!! ఇక నుంచి ATM ల ముందు నిలబడవలసిన పని లేదు. డబ్బు నేరుగా మన ఇంటికే తెచ్చి ఇస్తారట..!!ATM దగ్గర లైన్లో, బ్యాంకులో గంటలు గంటలు నించుని నించుని విసిగిపోయారా? ఐతే ఇది మీకు తప్పకుండా శుభవార్తే.
పాత నోట్ల రద్దు పుణ్యమా అని మనం పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. సరే, ఏదో మంచి పని జరుగుతుందిలే అని ఎన్ని రోజులు భరించగలం ? ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు మనకి ?

మన కష్టాలు తీర్చడానికి SNAPDEAL వాళ్ళు మనకోసం ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకి వచ్చారు.

SNAPDEAL ఒక ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్ సైట్. అంటే ఇంటర్నెట్ ద్వారా రకరకాల వస్తువులని అమ్ముతారని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఇప్పుడు SNAPDEAL వాళ్ళు క్యాష్ ని కూడా ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసేలా ఒక కొత్త సేవని ప్రవేశ పెట్టారు. అంటే మామూలు వస్తువులని ఆర్డర్ ఇచ్చినట్టే, మనం డబ్బు కావాలని SNAPDEAL వెబ్ సైట్లో కానీ, వాళ్ళ మొబైల్ యాప్ లో కానీ ఆర్డర్ ఇస్తే చాలు. కేవలం 24గంటల్లో మన ఇంటి వద్దకే కాష్ తెచ్చి ఇస్తారన్నమాట.

మీరు మొబైల్ యాప్ లో డబ్బు కావాలన్న అభ్యర్థన పెట్టగానే 24గంటల్లో SNAPDEAL నుంచి ఒకరు మీ ఇంటి వద్దకే వస్తారు.

మీరు చేయవలసిందల్లా మీ ATM కార్డుని వాళ్ళు తెచ్చే మెషిన్ లో గీయడమే. 2000 రూపాయల వరకు కాష్ ఇస్తారట.

సూపర్ ఐడియా కదా..!! ఇంత మంచి పని చేస్తున్నారు కదా మరి దీనికి వాళ్ళు అడిగే ఫీజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. కేవలం 1 రూపాయి మాత్రమే వాళ్ళు తీసుకునే ఫీజు. నమ్మలేకపోతున్నారు కదా? నమ్మండి బాబు.

కానీ ప్రస్తుతానికి ఈ సర్వీసు కేవలం గుర్గావ్(Gurgaon) మరియు బెంగుళూరు(Bangalore) నగరాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్నారు. అక్కడ సత్ఫలితాలు సాదిస్తే దేశం మొత్తం ఈ సర్వీసుని అందిస్తాం అంటున్నారు SNAPDEAL యాజమాన్యం.

మీరేమంటారు ఇది మంచి పనే కదా? మీ ఆలోచనలు నాతో పంచుకోడానికి కింద కామెంట్ చేయండి.

మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి.

ఇక సెలవు.

మీ

Yetakaram Yenkatrao.Yetakaram Yenkatrao ని  Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి