రద్దు చేసిన పాత 500/1000 నోట్లని ఏం చేస్తారో మీకు తెలుసా? (లేదు! వాటిని కాల్చరు.)
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 5 లక్షల కోట్లు రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లు జరిగాయి. ఇంతకీ మరి ఈ డబ్బునంతా ఏం చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.

RBI అధికారాలు చెప్పిన దాని ప్రకారం రద్దు అయిన పాత నోట్లు అన్ని బ్యాంకుల నుండి RBI కి చేరుకుంటాయి. RBI వద్ద Currency Verification and Process Machine(CVPC)  అనే యంత్రం ఒకటి ఉంది. ఈ యంత్రం సహాయంతో పనికివచ్చే పాత నోట్లను మరియు పనికిరాని పాత నోట్లను వేరు చేస్తారు. ఈ యంత్రం ఒక గంట లో 60,000 నోట్ల వరకు వేరు చేయగలదు.

ఇలా వేరు చేయగా వచ్చిన మంచి నోట్లు రీసైకిల్ చేసి కొత్త నోట్లు ముద్రిస్తారు. పనికిరాని నోట్లని ఎం చేస్తారో తెలుసా? వాటిని ముక్కలుగా కోసేసి ఇటుకలు తాయారు చేస్తారు. అవునండి మీరు విన్నది నిజమే. పనికిరాని పాత నోట్లని ఇటుకలుగా చేసి కంపెనీలకు అమ్మేస్తారట.

2001వ సంవత్సరం వరకూ పాత, చిరిగిన నోట్లన్నీ కల్చేసేవారు. కానీ ఇప్పుడు వాటిని ఇలా మళ్ళీ ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన ఇటుకలు కిలో 6 రూపాయల వరకు వస్తాయట.ఒక సంవత్సరంలో దాదాపు 8,28,000 కిలోల ఇటుకలు అమ్ముతారట.

ఈ ఇటుకలు మాములు ఇటుకలంత దృడంగా ఉండవు. అలానే ఇటుకలతో పాటు పేపర్ వెయిట్లు , ఫైల్స్, కాలెండర్లు కూడా తాయారు చేస్తారట.

ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక ఊపు ఊపిన డబ్బు పరిస్థితి చివరికి ఇలా అయిపోతుంది.

మీకు ఈ పోస్టు గనక నచ్చితే తప్పకుండా మీ మిత్రులకి ఫేస్బుక్ లో షేర్ చెయ్యండి.

చివరగా ఆ ఇటుకలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది కదూ. ఇవిగో ఈ కింద చూపించిన ఫోటోలలోలా ఉంటాయి.

Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి